అకిరా ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించిన రేణు దేశాయ్ నిర్మాతగా మారి మరాఠీలో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తోలి ప్రయత్నంగా రేణు దేశాయ్ నిర్మించిన ‘మంగలాష్ తక్ వన్స్ మోర్’ సినిమా విజయం సాదించింది. తోలి సినిమా అందించిన విజయంతో దర్శకురాలిగా కూడా మారుతున్నారు. దర్శకురాలిగా ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలని రేణు దేశాయ్ నిర్ణయించుకున్నారు. ‘ఇష్క్ వాలా లవ్’ను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నట్టు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా తెలిపారు. డైలాగులు, లిరిక్స్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చని, తెలుగు అభిమానులు కొంచం సహకరించాలని కోరారు.
రేణు దేశాయ్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు. ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాకు మరో ప్రత్యేకత ఎస్.జె.సూర్య సంగీతం. పవన్ కళ్యాణ్ ఖుషి, పులి చిత్రాల దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు పాటలను కంపోజ్ చేశారు. తెలుగులో ఈ సినిమా ఎంత సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి. నిర్మాతగా తెలుగులో కూడా రేణు విజయం సాదించాలని కోరుకుందాం.
