
పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ లు విడిపోయి చాలా కాలమైంది. ఆ తరువాత పవన్ మరో వివాహం చేసుకున్నాడు. అయినా కూడా పవన్ ఫాన్స్ రేణు దేశాయ్ ని సోషల్ మీడియా ద్వారా కాస్త ఇబ్బందికి గురిచేస్తున్నారు. తిరిగి పవన్ తో కలసి ఉండాలని రేణు ని కోరుతున్నారు. ఈ విషయం గురించి రేణు అనేక సందర్భాల్లో మాట్లాడినా ఆమెకు పవన్ ఫాన్స్ ఉంచి ఈ డిమాండ్ ఎదురవుతూనే ఉంది. దీనితో రేణు పేస్ బుక్ లో పవన్ ఫాన్స్ కు పెద్ద పోస్ట్ పెట్టారు.
”పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతం భార్య ‘అన్నా’.. నేను కాదు. వారిద్దరికీ అందమైన కూతురు కూడా ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం.. పవన్ కళ్యాణ్ నా పిల్లలకు తండ్రి. అందుకోసం మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉంటున్నాం. తాను పవన్ కళ్యాణ్ తో తిరిగి కలిసుండాలని అడగడం ఇకనైనా ఆపాలి” అని రేణు దేశాయ్ పవన్ ఫాన్స్ కు అప్పీల్ చేశారు.

