ప్రత్యేకం : బాలీవుడ్ లో సత్తా చాటుకోనున్న తెలుగమ్మాయి రేష్మ రాథోర్

Reshma
ప్రస్తుతం టాలీవుడ్ లో ఇంపోర్టెడ్ హీరోయిన్స్ హవానే కొనసాగుతోంది. అలాంటి టఫ్ కాంపిటీషన్ లో కూడా ‘ఈ రోజుల్లో’ సినిమాతో తన సత్తా చాటుకొని టాలీవుడ్ లో వరుసగా సినిమాలో చేస్తున్న తెలుగమ్మాయి రేష్మ. ఇప్పటి వరకూ తెలుగులో తన సత్తా చాటుకున్న రేష్మ ఇప్పుడు బాలీవుడ్ లో తన సత్తా చాటుకోవడానికి సిద్దమైంది.

తాజాగా రేష్మ రెండు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసింది. అందులో ఒక సినిమాకి విజయ్ పట్కర్ దర్శకత్వం వహిస్తారు. ‘ఈ రోజుల్లో’ సినిమా తరహాలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాలో కొత్త నటీనటులు నటించనున్నారు.ఈ సినిమా ఆగష్టు చివరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక రెండవ సినిమాకి అన్వర్ ఖాన్ డైరెక్టర్. నూతన నటీనటులు నటించనున్న ఈ సినిమా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని సాయి సినీ ప్రొడక్షన్ – ఎస్ఎం ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ వారు కలిసి నిర్మించనున్నారు. తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రేష్మ బాలీవుడ్ లో కూడా అతనా సత్తా చాటుకోవాలని కోరుకుందాం..

Exit mobile version