‘ఈ రోజుల్లో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగమ్మాయి రేష్మ రాథోర్ రెండు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసిందని కొద్ది రోజుల క్రితమే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం రేష్మ రాథోర్ తెలుగులో మరో మూడు సినిమాలకు సైన్ చేసింది. అందులో మొదటిది సందీప్ కిషన్ హీరోగా మూవీ మొఘల్ డా. డి. రామానాయుడు నిర్మించనున్న సినిమా. ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఎప్పుడు మొదలవుతుంది అనేది త్వరలో తెలుస్తుంది.
ఇది కాకుండా ‘సాధ్యం’ మూవీ డైరెక్టర్ కార్తికేయ దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా చేయనున్న సినిమాకి కూడా సైన్ చేసింది. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇవి రెండు కాకుండా చందమామ కథలు ఫేం అభిజీత్ హీరోగా కార్తికేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ దర్శకుడిగా పరిచయం కానున్న సినిమాకి కూడా సైన్ చేసింది. ఈ మూడు సినిమాలు త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి. కెరీర్ ప్రారంభం ఫాస్ట్ గా మొదలుపెట్టి మధ్యలో స్లో అయిన రేష్మ మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అయిపోతోంది.


