సైరా ఒరిజినల్ బడ్జెట్ ఇదే !

Sye Raa1

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రాబోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 280 కోట్ల భారీ బడ్జెట్‌ తో నిర్మించారు. పైగా ఈ బడ్జెట్ లో మెగాస్టార్ చిరంజీవి పారితోషికం మినహాయించి.. మెగాస్టార్ కి హోమ్ ప్రొడక్షన్ కాబట్టి, ఆయన లాభాలలో షేర్ ను తీసుకుంటారట. తెలుగు సినిమాల్లోనే అతిపెద్ద చిత్రంగా ఈ చిత్రం రాబోతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

Exit mobile version