రివ్యూ : బ్యాడ్ బాయ్ బిలినియర్స్ – ఇండియా – డాక్యుమెంటరీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

రివ్యూ : బ్యాడ్ బాయ్ బిలినియర్స్ – ఇండియా – డాక్యుమెంటరీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

Published on Oct 8, 2020 2:05 PM IST

ఎవరి ఆధారంగా : విజయ్ మాల్యా, సుబ్రతా రాయ్, నీరవ్ మోడీ

దర్శకత్వం : డైలాన్ మోహన్ గ్రే, జోహన్నా హామిల్టన్

నిర్మించినవారు : రేవా శర్మ, ఫ్రాన్సిస్ బ్రాడ్‌హర్స్ట్

సంగీతం : నైనితా దేశాయ్

ఎడిటింగ్ : డొమినిక్ కోక్

ఈ లాక్ డౌన్ సమయంలో పలు చిత్రాలు మరియు సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న తాజా డాక్యుమెంటరీ సిరీస్ బ్యాడ్ బాయ్ బిలినియర్స్ – ఇండియా. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ డాక్యుమెంటరీ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం.

కథ :

ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థలు ఇలాంటి డాక్యుమెంటరీలను అంతర్జాతీయ స్థాయిలో తీసుకొస్తున్నారనే సంగతి తెలిసిందే. ఇపుడు అదే తరహాలో మన దేశానికి చెందిన ప్రముఖ పేరు మోసిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అలాగే సుబ్రతా రాయ్ లాంటి బడా చేసిన స్కాముల ఆధారంగా తెరకెక్కించింది. వీరిలో ప్రతీ ఒక్కరికీ సెపరేట్ గా ఒక్కో గంట వరకు ఉంటుంది. ఇందులో వీరు ఎలా వచ్చారు ఎలా ఎదిగారు ప్రభుత్వాలను ప్రజలను ఎలా మోసం చేసారు? అన్నది ఈ డాక్యుమెంటరీలో అసలు సారాంశం.

ఏమి బాగుంది?

ఈ డాక్యూమెంటరీలో మొట్ట మొదటి ఎపిసోడ్ నే పెద్ద తిమింగలం విజయ్ మాల్యా మీదనే స్టార్ట్ చెయ్యడంతో మొదటి నుంచే ఆసక్తికరంగా అనిపిస్తుంది. మాల్యా ఒక ధనిక కుటుంబం నుంచే పుట్టినా అతను ఎలా ఎదిగాడు అతని ఐడియాలజి ఎలా ఉండేది. మద్యం సేవించడంపై అతను అనుకున్న ఆలోచన ఎంత ఉన్నతమైనది లాంటి పాయింట్స్ తో పాటుగా కింగ్ ఫిషర్ ను ఎలా స్థాపించాడు, ఎలా నడిపించాడు. అంతే కాకుండా ఎయిర్ లైన్స్ లోకి ఎలా వచ్చాడు ఎదిగాడు అలాగే అది నష్టాల్లోకి పోవడం కనీసం తన స్టాఫ్ కు కూడా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితికి దిగజారిపోవడం అలాగే మాల్యా ఫార్ములా 1 లోకి ఎలా ఎంటర్ అయ్యాడు ఇలా అతనికి చెందిన అనేక అంశాలను చాలా గ్రిప్పింగ్ గా అద్భుతమైన విజువల్స్ తో చూపించారు.

ఇక రెండవ ఎపిసోడ్ కు వచ్చినట్టయితే మరో పెద్ద చేప నీరవ్ మోడీ పై వస్తుంది. గుజరాత్ కు చెందిన ఒక చిన్న వజ్రాల వ్యాపారి అదే రంగంలో ప్రపంచంలోకి ఒక పెద్ద వ్యాపారస్తునిగా ఎలా ఎదిగాడు, పంజాబ్ నేషనల్ బ్యాంకు తో ఎలా సంబంధాలు కుదుర్చుకుని ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ స్టోర్స్ ను ఎలా ప్రారంభించాడు అన్న ఎపిసోడ్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. అలాగే అతని సంబంధీకులు, రిపోర్టర్స్, బ్యాంకు ఎంప్లాయ్ లు వీరందరి చుట్టూతా తిరిగే డ్రామా కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. వీటన్నిటిని మించి నీరవ్ మోడీ విదేశాలకు ఎలా పారిపోయాడు దీని అంతటి వెనుక ఎవరెవరు ఉన్నారు వంటివి చూపిన విధానం మరింత ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.

ఇక మూడో ఎపిసోడ్ కు వస్తే సహరాశ్రీ సుబ్రతా రాయ్ అనే వ్యక్తి ఒక చిన్న చిట్ ఫండ్ కంపెనీ తో వచ్చి దేశంలోనే ఒక ధనికునిగా ఎలా మారాడు అన్న దానిపై తెరకెక్కింది. సామాన్య జనం డబ్బులు ఎలా గుంజుకుని వాటితో ఎలా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, ఆ చిట్ ఫండ్ కంపెనీ ఎలా మొదలు పెట్టాడు లాంటి సీక్వెన్స్ లు చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. సుబ్రతా రాయ్ తన స్వార్ధ ఆలోచనలతో ప్రజల్లో ఎలా దేవుడయ్యాడు జైలుకు ఎలా వెళ్ళాడు ఇలా ఎన్నో రకాల అంశాలను చాలా బాగా చూపించారు.

ఏమి బాగోలేదు?

ఈ డాక్యుమెంటరీలో చూపిన మూడు ఎపిసోడ్లు బాగానే ఉన్నా వాటిలో ఉన్న వ్యక్తులపై చూపించిన బ్యాక్ డ్రాప్ ను చాలా సింపుల్ గా చూపించేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటి కీలక అంశాలు మరింత డిటైల్డ్ గా చూపించకపోవడం వల్ల సాధారణ ఆడియెన్స్ కు అంతగా అర్ధం కాకపోవచ్చు. ఈ విషయంలో మేకర్స్ మరింత కేర్ తీసుకుంటే బాగుణ్ణు.

చివరి మాటగా :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ బ్యాడ్ బాయ్ బిలినియర్స్ – ఇండియా డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ మన దేశానికి చెందిన భారీ స్కామ్ తిమింగలాలు చేసిన మోసాలు ఎలా చేసారు వారు ఎలా జనాన్ని ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించారు. వారి జీవితాల్లో ఎదుర్కొన్న ఘట్టాలు ఇలా అన్నీఈ ఆసక్తికరంగా చూపించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ మరియు సుబ్రతా రాయ్ లాంటి వారి మీదనే ఈ సిరీస్ ను ఎంచుకోవడం ఒక్కసారిగా మంచి అటెన్షన్ ను తీసుకొచ్చే అంశం. దేశ ఆర్ధిక వ్యవస్థలో మరియు సమాజంలో ఒక్కసారిగా కలకలం రేపిన ఈ ముగ్గురూ ఎలా చీట్ చేసారో లాంప్ అంశాలపై చేసిన ఈ డాక్యుమెంటరీ ఖచ్చితంగా చూడ్డానికి మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.

Rating: 3.25/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు