‘వర్మ’ కేసీఆర్ బయోపిక్ కు ఇంట్రస్టింగ్ టైటిల్ !

Published on Apr 18, 2019 2:57 pm IST

వివాదాల దర్శకుడు రామ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ బయోపిక్ ను కూడా అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు. టైగర్ అనే టైటిల్ తో..ద అగ్రెసీవ్ గాంధీ అనే క్యాప్షన్ తో ఈ సినిమా తియబోతున్నట్లు వర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

మరి కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. అలాగే రామ్ గోపాల్ వర్మ ఈ బయోపిక్ ను ఎప్పుడు మొదలు పెడతారో ఇతర నటీనటులుగా ఎవర్ని తీసుకుంటారో చూడాలి. ఇక ఇటీవలే రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రేక్షకుల బాగానే ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :