“అరియాన మిక్స్ ఆర్జీవీ ” కొత్త వెర్షన్ చూడమంటున్న వర్మ..!

Published on Jun 30, 2021 1:50 am IST


వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల బిగ్‌బాస్ ఫేమ్‌ అరియానాతో కలిసి చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియా వేదికగా మస్త్ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై నెటిజన్ల నుంచి రకరకాలుగా స్పందన వచ్చింది. అయితే తాజాగా ఇదే ఇంటర్వ్యూకు కొన్ని మెరుపులు జోడించి మరో వెర్షన్‌ను తీసుకొచ్చామని చూసి ఆనందించండి అంటూ వర్మ అభిమానుల ముందుకు వచ్చాడు.

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ అరియానాతో నేను చేసిన ఇంటర్వ్యూకి యూట్యూబ్‌లో మంచి స్పందన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఆ ఇంటర్వ్యూని చూసి అసంతృప్తి చెందిన వారిని కూడా మేము ప్రేమిస్తామని అన్నారు. సమాజం ఏమైపోతోంది అంటూ నెగెటివ్‌గా కామెంట్‌ చేసేవారికి నేనొక ఉచిత సలహా ఇస్తానంటూ అప్పుడప్పుడు కొంచెం ‘చిల్‌’ అవ్వండి.. జీవితమంతా సీరియస్‌గా ఉండకండని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ‘అరియానా మిక్స్‌ ఆర్జీవీ’ అదే ఇంటర్వ్యూకి గిమ్మిక్కులు జోడించి ఇంకో వెర్షన్‌ రిలీజ్ చేస్తున్నాం చూడండి.. చూసి ఆనందించండన్న వీడియోను వర్మ పంచుకున్నాడు. అయితే పాత ఇంటర్వ్యూకు మీమ్స్‌ జోడించి విడుదల చేసిన ఈ కొత్త వెర్షన్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :