విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని సంవత్సరాలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం కోసం దండయాత్ర చేస్తూనే వున్నాడు. ప్రస్తుతం రామూ ‘పట్టపగలు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా వున్నాడు
సమాచారం ప్రకారం రామ్ గోపాల్ వర్మ యువహీరో సచిన్ తో ఒక ద్విభాషాచిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా రొమాంటిక్ హర్రర్ జోనర్ లో తెరకెక్కుతుందని సమాచారం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. సచిన్ ఇటీవలే ఆషికీ 2 సినిమా రీమేక్ అయిన ‘నీజతగా నేనుండాలి’ ద్వారా మరోసారి మనల్ని పలకరించాడు


