
సంచలనాలకు సైతం చలనం తీసుకురాగల సత్తా రామ్ గోపాల్ వర్మ సొంతం. ప్రస్తుతం టి టౌన్ బి టౌన్ అంటూ తేడా లేకుండా అందరూ బాహుబలి మరియు రాజమౌళి మంత్రం పాటిస్తుంటే తాను కూడా సై అంటూ రామూ చేరిపోయాడు.
అయితే జక్కన్న – ప్రభాస్ ల భారీ ప్రాజెక్ట్ కి మెగాస్టార్ సినిమాని లింక్ చేస్తూ చిరంజీవి తన 150వ సినిమాను తప్పకుండా రాజమౌళితోనే చెయ్యాలి. ప్రభాస్ తో చేసిన బాహుబలి చిత్రమే ఆకాశాన్ని తాకితే, చిరు తో సినిమా అయితే అది విశ్వాంతరాలను దాటుతుంది. చిరు రాజమౌళితో కాకుండా మరే దర్శకుడితో చేసినా అది సాధారణ చిత్రంగానే నిలిచిపోతుంది. ఒకవేళ చిరంజీవి చిత్రం బాహుబలిని గనుక దాటకపోతే అది ప్రజారాజ్యం పార్టీ పెట్టడం కంటే పెద్ద తప్పే అవుతుందని తనదైన స్టైల్ లో ట్వీటిచ్చాడు రామూ