ఏడాదిన్నర తర్వాత ‘సీక్రెట్‌’తో వర్మ బాలీవుడ్ ఎంట్రీ!

ఏడాదిన్నర తర్వాత ‘సీక్రెట్‌’తో వర్మ బాలీవుడ్ ఎంట్రీ!

Published on Jun 7, 2015 3:43 PM IST

secret
రామ్ గోపాల్ వర్మ అంటే ఓ వివాదం, రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగు సినిమాకు ఓ కొత్త దారిని చూపిన మాస్టర్ ఫిల్మ్‌మేకర్. క్రైమ్, హర్రర్, డ్రామా, థ్రిల్లర్ ఇలా రకరకాల జానర్లలో సినిమాలు తీసిన వర్మకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మంచి పేరుంది. అయితే ఆయన బాలీవుడ్‌కు గత ఏడాదిన్నరగా దూరంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన అన్నీ తెలుగు సినిమాలే చేయడం విశేషం. ‘సత్య 2’ తర్వాత రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ ఎంట్రీకి తాను ఇంతవరకూ తీయని జానర్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా ‘సీక్రెట్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.

“ప్రతీ పెళ్ళైన మగాడి సెల్‌ఫోన్‌లో భార్యకు తెలియని ఓ రహస్య జీవితం ఉంటుంది” అంటూ సీక్రెట్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సచిన్ జోషి, మీరా చోప్రాలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో జెడ్ 3 ప్రొడక్షన్స్ నిర్మించింది. పెళ్ళైన ఓ వ్యక్తి మరో అమ్మాయితో సంబంధాన్ని పెట్టుకోవడం, ఆ తర్వాత అతడి జీవితంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమా ‘మొగలి పువ్వు’ పేరుతో విడుదల కానున్న విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు