‘ఆఫీసర్’ సినిమా ద్వారా ఏం చెప్పాలో ముందే నిర్ణయించుకున్నాను – వర్మ

Published on May 31, 2018 6:33 pm IST

నాగ్, ఆర్జీవీల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ‘ఆఫీసర్’ సినిమా రేపు విడుదలకానుంది. దీంతో నాగ్ అభిమానుల్లో వరుస ఫ్లాపుల్లో ఉన్న వర్మ ఈ సినిమాలో ఎం చూపిస్తాడు, ఏం చెప్తాడు అనే కంగారు నెలకొంది. కానీ వర్మ మాత్రం ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలి అనుకున్నానో నాకు ముందే తెలుసు. ఏం చేయాలి అనుకుంటున్నామో ముందే తెలిసి చేసే సినిమాల ఫలితం బాగుంటుంది.

ఈ చిత్రం కూడ అంతే బాగుంటుంది. నేను ఏమైతే చెప్పాలనుకున్నానో వాటిని సినిమాకు ముందే లిస్ట్ రాసి నాగార్జునకు ఇచ్చాను. ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోమని లేకపోతే తన్నమని చెప్పాను అంటూ సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఒక పోలీస్ అధికారికి సంబందించిన ఇంటెన్స్ అండ్ రా స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫాదర్, డాటర్ రిలేషన్ షిప్ కూడ హైలెట్ గా ఉండనుంది.

సంబంధిత సమాచారం :