
ఐస్ క్రీమ్ సినిమాను ఫ్లో కామ్ అనే కొత్త పరికరంతో చిత్రీకరించాడు ఆర్.జీ.వి. ఇటువంటి టెక్నాలజీ మునుపెన్నడూ ఇక్కడ వాడలేదు. ఈ ఫ్లో కామ్ విధానం ద్వారా సినిమాటోగ్రాఫర్ లు వివిధ కెమెరా యాంగిల్స్ తో చిత్రీకరణ జరపడం సాధ్యపడుతుంది
ఈ ఫ్లో కామ్ కు సంబంధించిన విశేషాలు తెలుపడం కోసం మరియు సినిమాకు కాసింత పబ్లిసిటీ తీసుకురావడం కోసం రామూ ఒక ఫ్రీ వర్క్ షాప్ ని నిర్వహిస్తున్నాడు. ఆసక్తి కలవారు ఎవరైనా ఈ వర్క్ షాప్ కి రేపు ప్రసాద్స్ లో హాజరుకావచ్చు
టెక్నాలజీని వాడడంలో రామూ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. మరి ఈ కొత్త పరికరం రామూకి ఇస్తుందా లేదా అన్నది చూడాలి

