రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు హీరోగా నటించనున్నారా..? ఫిల్మ్ నగర్ ప్రముఖుల నుండి అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘పోకిరి రిటర్న్స్’ అనే టైటిల్ ఖరారు చేశారట. ఈ చిత్రంలో సంపూర్నేష్ బాబు సీరియస్ రోల్ లో కనిపించనున్నారు.
ఫిల్మ్ చాంబర్ లో ‘పోకిరి రిటర్న్స్’ టైటిల్ ను నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ రిజిస్టర్ చేయించారు. భీమవరం టాకీస్ బ్యానర్ పై ‘ఐస్ క్రీమ్’ పేరుతో వరుసగా వర్మ దర్శకత్వంలో చిత్రాలను నిర్మిస్తున్నది ఈ నిర్మాతే. వర్మ కోసమే నిర్మాత ఈ టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. అయితే దర్శకనిర్మాతల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం సంపూర్నేష్ బాబు ‘సింగం 123’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అల్లరి నరేష్ ‘బందిపోటు’లో కీలక పాత్రలో నటించారు.


