రియా, సుశాంత్ కాళ్ళకి దణ్ణం పెట్టిందట.!

Published on Aug 28, 2020 2:30 pm IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి అన్నది ఇంకా తెలియరాలేదు. అలాగే మరోపక్క ఈ కేసుకు సంబంధించిన కీలక వ్యక్తులపై మాత్రం అధికారులు ఇంకా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో కీలక వ్యక్తి అయినటువంటి రియా చక్రవర్తి విషయంలో అయితే ప్రతీ రోజు ఒక్కో ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తుంది.

ఒకప్పుడు సుశాంత్ పై పలు సంచలన ఆరోపణలు చేసిన ఈమె ఇపుడు మరిన్ని ఊహించని కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అవుతుంది. తనకు చనిపోక ముందు అతని స్నేహితులతో కలిసి పెద్ద మొత్తంలో ఖర్చు చేసేవాడని అతను చనిపోక ముందు తనకి బాలేనప్పుడు కనీసం నాతో మాట్లాడలేదని ఆ సమయంలో నన్ను వదిలించుకోవాలని అనుకున్నాడేమో అని అనిపించింది అని అంతే కాకుండా ఆ కొద్ది రోజులకే సుశాంత్ మరణించాడని వచ్చిన వార్త విని ఎంతగానో ఏడ్చానని మార్చురీ దగ్గర అతని కాళ్ళకి దణ్ణం పెట్టి ఏడ్చానని లేటెస్ట్ ఇంటర్వ్యూ లో తెలిపినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :