‘మత్తు వదలరా’ చిత్ర దర్శకుడు రితేష్ రానా ప్రస్తుతం కమెడియన్ సత్య లీడ్ రోల్లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు జెట్లీ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని వారు రివీల్ చేశారు.
ఈ చిత్రంలో హీరోయిన్గా మిస్ యూనివర్స్ ఇండియా భామ రియా సింఘ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు వారు అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పూర్తి యాక్షన్ మోడ్లో రియా ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఇక ఈ సినిమా కథ పూర్తిగా ఓ ఫ్లైట్లో జరగనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను క్లాప్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు.


