‘షకీలా బయోపిక్’ కోసం తెగ కష్టపడుతున్న హీరోయిన్ !

‘షకీలా బయోపిక్’ కోసం తెగ కష్టపడుతున్న హీరోయిన్ !

Published on Oct 23, 2018 12:50 PM IST

‘షకీలా’ సినిమా వస్తుందంటే చాలు.. ఇక పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆమె చిత్రాలకు పోటీగా తమ చిత్రాలను విడుదల చేసేవారు కాదు. అలాంటి ‘షకీలా’ జీవిత కథ ఇప్పుడు సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాకు చెందిన షకీలా.. సినీరంగంలోకి ఎలా వచ్చారు ? శృంగార తారగా ఎలా మారారు ?. సినీరంగంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి ? ఎంతమంది ఆమెను మోసం చేశారు ? ఇలాంటి పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె బయోపిక్ లో చూపించనున్నారు.

కాగా షకీలా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. త్వరలో చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టబోతుంది. అయితే ఈ ప్రమోషన్స్ లో రిచా బెల్లి డ్యాన్స్ చేయబోతుందట. దీని కోసం ఆమె ప్రత్యేకంగా బాలీవుడ్ బెల్లి డ్యాన్స్ స్పెషలిస్ట్ ల దగ్గర కోచింగ్ తీసుకుంటుంది. రిచా చద్దా ఈ సినిమాలో నటించబోయే ముందు ష‌కీలాతో మాట్లాడి ఆమె వ్యక్తిగత జీవితం గురించి, ఆమె బాడీ లాంగ్వేజ్ గురించి కూడా అడిగి తెలుసుకుని మరి నటించారు.

మొత్తానికి రిచా చద్దా షకీలా బయోపిక్ కోసం బాగానే కష్టపడుతుంది. ఈ చిత్రం హిందీ, మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు