కల్కి X కాంతార: బుజ్జిని డ్రైవ్ చేసిన రిషబ్ శెట్టి!

కల్కి X కాంతార: బుజ్జిని డ్రైవ్ చేసిన రిషబ్ శెట్టి!

Published on Jun 24, 2024 10:00 PM IST

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో బుజ్జి రోల్ చాలా స్పెషల్ గా ఉండనుంది. ఈ రోల్ కి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అందించారు. బుజ్జి రోల్ పై క్లారిటీ కోసం మేకర్స్ గ్రాండ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రముఖులు ఈ బుజ్జి ను డ్రైవ్ చేశారు.

ఆ లిస్ట్ లోకి కన్నడ స్టార్ హీరో, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కూడా చేరిపోయారు. తాజాగా బుజ్జి ను డ్రైవ్ చేస్తున్న వీడియో ను కల్కి టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. రిషబ్ శెట్టి తదుపరి కాంతార చాప్టర్ 1 లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రచయిత, దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. 2022 లో రిలీజైన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు