‘చిత్రలహరి’కి బిజినెస్ బాగానే జరిగిందిగా ?

Published on Apr 10, 2019 12:01 pm IST

కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ఏప్రిల్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘చిత్రలహరి’. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.13 కోట్ల వరకు చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాకి బాగానే బిజినెస్ జరిగింది.

కానీ డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో సతమతమౌతున్న సాయి ధరమ్ తేజ్ కి ఈ సినిమా ఖఛ్చితంగా హిట్ అవ్వాల్సిన పరిస్థితి. మరి తేజ్ ఈ చిత్రంతోనైనా తన ప్లాప్ ల పరంపరకు బ్రేక్ వేస్తాడేమో చూడాలి. ఈ సినిమాను సక్సెస్‌ ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శనితో పాటు మరో హీరోయిన్ నివేత పేతురాజ్ కూడా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :