‘మెగా హీరో’ సరసన రితికా సింగ్ ?
Published on Jun 13, 2018 1:20 am IST

మెగా మేనల్లుడు ‘సాయి ధరమ్ తేజ్’ తన తర్వాత చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించనున్నారు. కిషోర్ తిరుమల గతంలో ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే కిషోర్, సాయి ధరమ్ తేజ్ కు కథ చెప్పారని అది తేజ్ కు బాగా నచ్చిందని సమాచారం. ప్రస్తుతం తేజ్, కరుణాకరాన్ దర్శకత్వంలో ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రంతో జులై 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత ‘తేజ్, కిషోర్’ చిత్రం ప్రారంభం కానుంది.

తాజా సమాచారం ప్రకారం ‘సాయి ధరమ్ తేజ్’ సరసన ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ హీరోయిన్ గా నటించనుంది. అయితే దర్శకనిర్మాతల నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం కామెడీ మరియు ఎమోషన్స్ తో కూడుకున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook