ఎటువంటి విషయంలో అయినా సూటిగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పడంలో మిగతా సెలబ్రిటీల కంటే సమంత ఓ అడుగు ముందు ఉంటుంది. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించదు.
హీరోయిన్ల మధ్య పోటీ గురించి అడిగినప్పుడు… మా మధ్య అటువంటి ఏమి లేదు.. మేము చాలా స్నేహంగా ఉంటాం. అని చెప్తుంటారు. కొందరు టాప్ హీరోయిన్లయితే నాకు నేను పోటి అని చెప్పుకొంటారు. కానీ, సమంత మాత్రం ఏమంటుందో తెలుసా.. ‘నేను ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోయిన్ ను పోటిగానే భావిస్తా. ఆ పోటి వృత్తిపరంగా మాత్రమే, వ్యక్తిగతంగా స్నేహంగా ఉంటాం. అని సెలవిచ్చింది.
ఒక సినిమాలో నన్నే హీరోయిన్ గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు. అని నేను ఎప్పుడూ నాలో నేను ప్రశ్న వేసుకుంటాను. అందుకు తగ్గట్టుగా నన్ను నేను మలచుకుంటా. అంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడుతో చెప్పింది.


