స్టార్ హీరోలతో పోటీపడుతున్న కమెడియన్ !
Published on Nov 16, 2018 8:15 am IST

కోలీవుడ్లో వచ్చే ఏడాది పొంగల్ కు రెండు భారీ చిత్రాలు బాక్సాఫిస్ బరిలో నిలిచాయని తెలిసిందే. దాంట్లో భాగంగా మొదటగా సూపర్ సార్ట్ రజనీకాంత్ నటిస్తున్న ‘పెట్టా’ జనవరి 10న విడుదలకానుంది సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక రెండో చిత్రం తల అజిత్ నటించిన’ విశ్వాసం’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 15న విడుదల అయ్యే అవకాశాలు వున్నాయి.

ఇక ఈ రెండు చిత్రాలతో పాటు మరో చిత్రం కూడా పొంగల్ కు విడుదలకానుంది. అదే ప్రముఖ తమిళ కమెడియన్ ఆర్ జే బాలాజీ నటిస్తున్న ‘ఎల్కేజీ’. పొలిటికల్ సెటైర్ గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద ‘ పెట్టా , విశ్వాసం’ చిత్రాలకు ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి.

  • 4
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook