“షాదీ ముబారక్” విషయంలో స్పెషల్ థాంక్స్ చెప్తున్న ఆర్కే సాగర్!

Published on Mar 7, 2021 4:53 pm IST

స్మాల్ స్క్రీన్ పై సెన్సేషనల్ ఫేమ్ తెచ్చుకున్న హీరో ఆర్కే సాగర్. స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ పైకి కూడా హీరోగా పరిచయం అయ్యిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా సోసోగానే వచ్చినా లేటెస్ట్ చిత్రం “షాదీ ముబారక్”కు మాత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో చేసి డీసెంట్ బజ్ నడుమ విడుదల చేసుకున్నాడు. అయితే గత శుక్రవారం విడుదల కాబడిన ఈ చిత్రం డీసెంట్ ఓపెనింగ్స్ నే అందుకుంది.

మరి ఈ సందర్భంగా ఆర్కే సాగర్ ఆడియెన్స్ కు అలాగే తన నిర్మాతలకు స్పెషల్ థాంక్స్ ను తెలిపాడు. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలం అయ్యిందని తాను కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ తో ఈ సినిమా చూశానని వారితో పాటు అన్ని ఏజ్ గ్రూపులు వారు కూడా ఎంతో ఎంజాయ్ చేసారని తెలిపాడు. దర్శకుడు పద్మశ్రీ మంచి కామెడీ ఎంటెర్టైనెర్ గా దీనిని తెరకెక్కించడం ప్లస్ అయ్యిందని అందుకు తనకి ఇలాంటి సినిమా ఇచ్చిన నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లకు స్పెషల్ థాంక్స్ ను తెలిపాడు.

సంబంధిత సమాచారం :