రోబో 2.0 రిలీజ్ ఇప్పట్లో లేనట్లే !

రోబో 2.0 రిలీజ్ ఇప్పట్లో లేనట్లే !

Published on Jun 12, 2018 1:53 AM IST

rooobo

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న 2. 0 చిత్ర రిలీజ్ ఈ ఏడాది లో లేనట్లే అని తెలుస్తున్నది. సూపర్ స్టార్ రజినీకాంత్ , అమీ జాక్సన్ , అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు . ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యి గ్రాండ్ గా ఆడియోకూడా రిలీజ్ అయింది . అయినా ఇప్పటికి ఈ చిత్రం యొక్క రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.

మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ లేదా మే లో విడుదల చేస్తామన్నారు అది కాస్త జులై కి మారింది . ఇప్పుడు అప్పటికి కాదుకదా ఈ ఏడాది చివర్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనబడటం లేదు . దీనికి కారణం చిత్రానికి సంబంధించిన విఎఫ్ఎస్ పనులు పెండింగ్ ఉండండం మరియు చిత్రం ఓవర్ షూటింగ్ వల్ల బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుందట . అందుకే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయనున్నారని తెలుస్తుంది .

తాజా వార్తలు