ఈ ఏడాది వచ్చిన ‘బాహుబలి’ సినిమా సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ కి పరిచయం చేస్తే, ప్రస్తుతం సౌత్ ఇండియన్ కమర్షియల్ డైరెక్టర్ శంకర్ సౌత్ నుంచి ఒక హాలీవుడ్ సినిమానే తీయాలనే సంకల్పంలో ఉన్నారు. ఆ సినిమానే ‘రోబో 2’. 210లో వచ్చిన రోబో సినిమాకి సీక్వెల్ గా అంత్యంత భారీ బడ్జెట్ తో, ఉన్నత సాంకేతిక విలువలతో ఓ హాలీవుడ్ సినిమాలా ‘రోబో 2’ని తీయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు శంకర్. ఇప్పటికే కథని పర్ఫెక్ట్ గా సిద్దం చేసిన శంకర్ ప్రస్తుతం ఈ సినిమా నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు.
ఇటీవలే ఈ సినిమాలో ఓ 20 నిమిషాల పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ని కూడా అప్రోచ్ అయ్యాడు. ఆర్నాల్డ్ కూడా ఆ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన మరో ఆసక్తికర విషయాన్ని మీకందిస్తున్నాం. రోబో 2 సినిమాని హాలీవుడ్ సినిమాలా తీయడమే కాకుండా ఒక హాలీవుడ్ మూవీ రన్ టైంని కూడా ఫాలో అవుతున్నారు. ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు ఒకటిన్నర గంట ఉంటాయి. అనగా 90 నిమిషాలు. శంకర్ కూడా రోబో 2 న కేవలం 90-100 నిమిషాల్లోపే ఫినిష్ అయ్యేలా కథని సిద్దం చేసాడు. సుమారు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని రజినీకాంత్ బర్త్ డే కానుకగా లాంచ్ చేసి జనవరిలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు.


