కాంచన 3 క్లైమాక్సే హైలెట్ అంటా !

Published on Apr 18, 2019 6:50 pm IST

హారర్ సస్పెన్స్ జోనర్ లో భారీ హిట్ చిత్రం ముని సిరీస్ లో భాగంగా వస్తోన్న తాజా చిత్రం కాంచన 3. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ 19వ తేదీన తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది.

కాగా ఈ సినిమాలో క్లైమాక్స్ చాలా బాగుంటుందని.. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే వి.ఎఫ్.ఎక్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. అలాగే లారెన్స్ నటన కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదలచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :