హరికృష్ణకు పాటతో నివాళులర్పించిన రాక్ స్టార్ !

Published on Aug 30, 2018 7:58 am IST

నిన్న తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన హరికృష్ణ కు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ నివాళులు అర్పించారు. ఒక మంచి మనిషిని కోల్పోయాం . తారక్, కళ్యాణ్ రామ్ గారు మీతో మేమున్నాం అని డాలస్ కాన్సర్ట్ ను హరికృష్ణ గారికి అంకితం ఇస్తున్నాం అని దేవి శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

ఈ సంధర్బంగా నాన్నకు ప్రేమతో సినిమాలోని నాన్నకు ప్రేమతో అనే సాంగ్ ను తన బృందం తో కలిసి ఆలపించారు. ఇక దేవి ప్రస్తుతం కాన్సర్ట్ నిమ్మిత్తం డాలస్ లో వున్నారు. ఈకాన్సర్ట్ లో ఆయనతో పాటు సింగర్లు హేమచంద్ర, శ్రావణ భార్గవి, సాగర్, రేనినా రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు.

సంబంధిత సమాచారం :

X
More