చైతు, సమంత ‘మజిలీ’లో రొమాంటింక్ సీన్సే హైలెట్ !

Published on Jan 17, 2019 9:38 am IST

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా రాబోతున్న చిత్రం మజిలీ. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో సమంత ఒక రైల్వే ఉద్యోగిగా కనిపించనుంది. చై అండ్ సామ్ మధ్య వచ్చే రొమాంటింక్ సీన్స్ చాలా సహజంగా, సరళమైన రీతిలో తెరకెక్కతున్నాయట. ఇక వీరి లవ్ స్టోరీ కూడా 1990 కాలంలో జరుగుతుంది.

కాగా చైతు ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడట. సమంతతో పెళ్లికి ముందు ఒక గెటప్ లో.. అలాగే పెళ్లి తరువాత మరో గెటప్ లో కనిపిస్తాడట. పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X