యంగ్ హీరో రోషన్ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ‘ఛాంపియన్’ సినిమా వచ్చింది. ఈ సినిమాలో రోషన్ నటనతో పాటు తన లుక్స్ కి కూడా మంచి పేరు వచ్చింది. ఐతే, తాజాగా రోషన్‌కు మరో భారీ ఆఫర్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రోషన్ ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రోషన్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు తెలిపారు.
నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘రోషన్ కోసం శైలేష్ కొలను ఫుల్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ రాసినట్లు చెప్పారు. శైలేష్, న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హిట్ 3’ బాగానే ఆడింది. ఐతే, ఆ సినిమా ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగింది. మరి ఇప్పుడు శైలేష్, రోషన్ తో ఎలాంటి కామెడీ సినిమా చేస్తాడో చూడాలి. మొత్తానికి, ‘ఛాంపియన్’ సినిమాతో రోషన్ కెరీర్ కొత్త దశలోకి అడుగుపెట్టినట్టే కనిపిస్తోంది.
