‘అనగనగా ఒక రాజు’కి త్రివిక్రమ్ రివ్యూ.. మొన్న నిర్మాత ఇప్పుడు హీరో

Anaganaga Oka Raju

రానున్న సంక్రాంతి రేస్ లో తెలుగు సినిమా నుంచి దాదాపు అన్నీ ఫ్యామిలీ ఎంటర్టైన్ చిత్రాలే వస్తున్నాయి. మరి ఈ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఎంటర్టైనర్ చిత్రం “అనగనగా ఒక రాజు” (Anaganaga Oka Raju)కూడా ఒకటి. మరి ఈ సినిమా ఆల్రెడీ ఆఫ్ లైన్ లో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుపుకుంటుంది.

అయితే ఈ సినిమాతో ఎట్టి పరిస్థితిల్లో హిట్ కొట్టాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. దానికి మరింత బూస్టప్ ఇచ్చే విధంగా దర్శకుడు త్రివిక్రమ్ జడ్జిమెంట్ ని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఇటీవల నిర్మాత నాగవంశీ అనగనగా ఒక రాజు సినిమా త్రివిక్రమ్ గారు చూసి సర్టిఫై చేసారని అపుడు ఇంకా నమ్మకం వచ్చిందని తెలిపారు.

ఇక లేటెస్ట్ గా నవీన్ కూడా ఈ సినిమాని త్రివిక్రమ్ చూసి చాలా ఎంజాయ్ చేసారని తన బూస్టప్ తమకి ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టుగా తెలిపాడు. సో త్రివిక్రమ్ రివ్యూ విషయంలో మాత్రం వీరు గట్టిగానే నమ్మి రంగంలోకి దిగబోతున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమా రానున్న జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version