కొరటాల వెబ్ సిరీస్ లో రోషన్‌ ?

Published on Sep 26, 2020 11:03 pm IST


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఓ వెబ్ సిరీస్ తో నిర్మాతగా మారబోతున్న సంగతి తెలిసిందే. టినేజ్ లవ్ వల్ల లైఫ్ ఎలా డిస్టర్బ్ అవుతుందనే పాయింట్ మీద కొరటాల కథను రాసాడని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో శ్రీకాంత్ కుమారుడు రోషన్‌ మేకాహీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తన అసిస్టెంట్ కి దర్శకత్వం అవకాశం ఇస్తూ కొరటాల ఈ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నాడు. ఇక ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తన శైలిలోనే ఈ సినిమా సాగనుంది.

కాగా రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్ గా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. చరణ్ నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలవ్వనుంది.

కాగా అక్టోబర్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై ఐదు రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలకమైన సీన్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

సంబంధిత సమాచారం :

More