ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’.. స్ట్రీమింగ్ ఎందులో తెలుసా?

ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’.. స్ట్రీమింగ్ ఎందులో తెలుసా?

Published on Jan 29, 2026 7:00 AM IST

Champion

యంగ్ హీరో రోషన్ మేకా లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఛాంపియన్’ మంచి అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను ప్రదీప్ అద్వైతమ్ డైరెక్ట్ చేయగా స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.

పీరియాడిక్ నేపథ్యంగా సాగిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్ ఈ చిత్రాన్ని నేటి(జనవరి 29) నుంచి స్ట్రీమింగ్ చేస్తుంది.

ఈ సినిమాలో అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించగా మిక్కీ జే మేయర్ ఈ మూవీకి సంగీతం అందించారు. మరి థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు