రాక్ స్టార్ పాత్రలో ‘రోగ్ ‘ హీరో !

రాక్ స్టార్ పాత్రలో ‘రోగ్ ‘ హీరో !

Published on Aug 22, 2018 10:56 AM IST

డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం’రోగ్’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈచిత్రంలో తో 2017లో విడుదలైయింది. మన్నార్ చోప్రా, ఏంజెలా కథనాయికలుగా నటించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిచారు. ఇక ఈ సినిమా ఏడాది విరామం తీసుకొని మరో చిత్రంలో నటించడానికి సిద్ధ మవుతున్నాడు ఈహీరో.

నూతన దర్శకుడు తెరెకెక్కించనున్న ఈచిత్రంలో ఇషాన్ రాక్ స్టార్ పాత్రలో కనిపించనున్నాడు. సంగీతం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని విజయ దశమి కి లాంచ్ చేసి డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నారు. మొత్తం ఈచిత్రంలో 12పాటలు ఉండనున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రంతోనే ఇషాన్ విజయం సాధిస్తాడో చూడాలి. ఇక ఇషాన్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు