ఆది యాక్షన్ ప్యాక్ ‘రఫ్’ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్

ఆది యాక్షన్ ప్యాక్ ‘రఫ్’ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్

Published on Nov 6, 2014 11:49 AM IST

Rough
ఇప్పటి వరకూ లవర్ బాయ్ ఇమేజ్ వరుసగా లవ్ ఎంటర్ టైనర్స్ తీసిన యంగ్ హీరో ఆది చేసిన లవ్ అండ్ మాస్ ఎంటర్టైనర్ ‘రఫ్’. ఆది మొదటి సారి చేసిన ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్ టైనర్ కోసం ఆది తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం టైం తీసుకొని సిక్స్ ప్యాక్ కూడా చేసాడు.

షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఆడియో విడుదలైంది. అదే రోజున ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ సినేమాలి ఆది సిక్స్ ప్యాక్ లుక్ మరియు మాస్ అడైలాగ్స్ కి మంచి రేపొంస్ వస్తోంది. ఇది కాకుండా ఆది సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించే క్లైమాక్స్ ఫైట్ సినిమాకి హైలైట్ అవుతుందని ఈ చిత్ర టీం అంటోంది.

ఈ మూవీలో ఆది సరసన రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేస్తుండగా, ఓ కీలక పాత్రలో శ్రీ హరి కనిపించనున్నారు. సుబ్బారెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అభిలాష్ మాధవరం నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.

 

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు