కొత్త రికార్డు సృష్టించిన రౌడీ బేబీ !

కొత్త రికార్డు సృష్టించిన రౌడీ బేబీ !

Published on Jan 18, 2019 2:00 PM IST

తమిళ హీరో ధనుష్ , ఫిదా ఫేమ్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం’మారి 2′. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యావరేజ్ కలెక్షన్ల తో సరిపెట్టుకుంది. అయితే ఈ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ అనే సాంగ్ యూ ట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది. ఇటీవల ఈ వీడియో సాంగ్ ను విడుదలచేయగా కేవలం 15రోజుల్లో 90 మిలియన్ల వ్యూస్ ను అలాగే 10లక్షల లైక్స్ ను రాబట్టుకుని సౌత్ నుండి అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకున్న సాంగ్ గా కొత్త రికార్డు నెలకొల్పింది.

ప్రధానంగా సాయి పల్లవి వేసిన స్టెప్స్ ఈ సాంగ్ కు ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ సాంగ్ కు కొరియోగ్రఫీని అందించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు