500 మిలియన్ వ్యూస్.. రౌడీ బేబీ రికార్డ్ !

Published on Jun 2, 2019 7:00 pm IST

ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌ను మోత మోగించిన వీడియో ఏదైనా ఉందంటే అది ‘మారి 2’ చిత్రంలోని రౌడీ బేబీ వీడియో సాంగ్. గత ఏడాది 21న విడుదలైన ఈ చిత్రంలో సాయి పల్లవి, ధనుష్ జంటగా నటించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించకలేకపోయినా అందులోని రౌడీ బేబీ పాట మాత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

అత్యంత వేగంగా 100, 200 మిలియన్ల వ్యూస్ అందుకున్న ఈ సాంగ్ 300, 400 మిలియన్ల వ్యూస్ కూడా అవలీలగా సాధించి ప్రస్తుతం 500 మిలియన్ వీక్షణలతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో ధనుష్ స్వయంగా ఈ పాటను రాసి ఆలపించగా ఆయనతో పాటు డీ అనే గాయని పాటను ఆలపించింది. పాటలో సాయి పల్లవి గ్లామర్, డాన్స్ మూమెంట్స్ వీక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుని మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి.

సంబంధిత సమాచారం :

More