10 రోజుల క్రితం అమెరికాలో ప్రారంభమైన ‘రౌడీ ఫెలో’ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. వాషింగ్టన్, వర్జీనియాలలో జరిగిన ఈ షెడ్యూల్లో మెయిన్ లీడ్ పెయిర్ నారా రోహిత్, విశాక సింగ్ లపై అక్కడ అందమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించారు. ‘రౌడీ ఫెలో’ సినిమా ద్వారా లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది.
‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న సన్నీ ఈ సినిమాకు స్వరాలను అందిస్తున్నారు. స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ భలే తమ్ముడు’లోని ‘ఎంతవారుగాని.. వేదాంతులైనాగాని.. వాలు చూపు తాకగానే’ పాటను రీమిక్స్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ త్వరలో మొదలవుతాయి. మూవీ మిల్స్ పతాకంపై ప్రకాష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


