మానవత్వం గురించి మాట్లాడే సినిమా ‘రౌడీ ఫెలో’ – నారా రోహిత్

మానవత్వం గురించి మాట్లాడే సినిమా ‘రౌడీ ఫెలో’ – నారా రోహిత్

Published on Nov 18, 2014 4:30 PM IST

Rowdy-Fellow
నారా రోహిత్, విశాక సింగ్ జంటగా గేయ రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రౌడీ ఫెలో’. మూవీమిల్స్ మరియు సినిమా 5 సంస్థలు నిర్మాణంలో సినిమా తెరకెక్కింది. ప్రకాష్ రెడ్డి నిర్మాత. సన్నీ యంఆర్ సంగీత దర్శకుడు. ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందకు వస్తుంది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు సినిమా విశేషాలను తెలియజేయడానికి మీడియా సమావేశం నిర్వహించారు.

హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. ప్రతి మనిషికి ఇగో ఉండడంలో తప్పు లేదు. కాని, అది కంట్రోల్లో ఉండాలి. అప్పుడే మనం అభివృద్ధిలోకి వస్తాం. పురాణాలు కూడా ఇగోల కారణంగానే జరిగాయి. ఈ పాయింట్ తో కృష్ణచైతన్య సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో నేను బాగా ఇగో ఉన్న పోలీస్ ఆఫీసర్ గా, రిచ్ కుర్రాడిగా నటించాను. నా క్యారెక్టర్ లో ఎటువంటి మార్పు చోటు చేసుకుంది అనే కధాంశంతో సినిమా రూపొందింది. ‘పేరుకే ఇందరి జనం, పేరుకుపోయిన ఒంటరితనం, నరనరాన పిరికితనం, అందుకు జవాబే మనం’ ఇది మా సినిమా కాన్సెప్ట్. మానవత్వం గురించి మాట్లాడే సినిమా ‘రౌడీ ఫెలో’. ఈ నెల 21న విడుదల చేస్తున్నాం. సినిమా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.

జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టు మనుషులే కనపడుతున్నారు. మానవత్వం కనబడడం లేదు అనే పాయింట్ తో సినిమా తెరకేక్కించాను. అని దర్శకుడు కృష్ణచైతన్య అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ విశాఖ సింగ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు