టాలీవుడ్ యువ నటుడు ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా బేబీ. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విరాజ్ అశ్విన్ కీలక పాత్ర చేసారు. ఎస్ కె ఎన్ నిర్మాతగా సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఈ మూవీకి విజయ్ బుల్గనిన్ అందించిన సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ అందుకోవడం జరిగింది.
అయితే విషయం ఏమిటంటే రేపు గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానున్న బేబీ మూవీ యొక్క స్పెషల్ ప్రీమియర్ షో ని నేడు హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో ప్రదర్శిస్తుండగా ఈ షో కి ప్రముఖ యంగ్ సెన్సేషనల్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ విచ్చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బేబీ మేకర్స్ ఈ విషయాన్ని తెలిపారు. మరోవైపు బేబీ కి మంచి పాజిటివ్ బజ్ ఉండడంతో తప్పకుండా అందరి అంచనాలని తమ ప్రేమకథా చిత్రం అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
