గతంలో ‘ఆడుమాగాడ్రా బుజ్జి’, ‘బెట్టింగ్ బంగార్రాజు’, ‘పూల రంగడు’, ‘నువ్వే నా బంగారం’ లాంటి సినిమాలకు రైటర్ గా పనిచేసిన లంకపల్లి శ్రీనివాస్ డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన సినిమా ‘పోరా పోవే’. ఈ శుక్రవారం రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబందించిన విశేషాలను శ్రీనివాస్ తెలియజేశాడు.
‘పోరా పోవే ఒక లవ్ ఎంటర్టైనర్. ఈ సినిమా స్కూల్ డేస్ నుంచి మొదలవుతుంది. కావున అన్ని రకాల వయసు వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. అలాగే రీ రికార్డింగ్ అనేది ఈ సినిమాకి ఓ మేజర్ హైలైట్ అవుతుంది. మా లవ్ స్టొరీని ఆడియన్స్ కి మరింత కనెక్ట్ చేస్తుంది’.
కరుణ్ – సౌమ్య కుమార్ జంటగా నటించిన ఈ సినిమాకి చంద్రబోస్ పాటలు రాయగా, యజమానియా సంగీతం అందించాడు. సెన్సార్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 18న విడుదల కానుంది.


