ఉదారత చాటుకున్న “RRR” నటుడు.!

ఉదారత చాటుకున్న “RRR” నటుడు.!

Published on Jun 2, 2020 6:19 PM IST

ఇప్పుడు ఒక్క మన టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం ఇండియా లోనే భారీ మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రాల్లో “RRR”(రౌద్రం రణం రుధిరం) ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలను నెలకొల్పుకుంది.

భారీ పీరియాడిక్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అజయ్ దేవగన్ కరోనాతో బాధ పడుతున్న వారికి సాయం చేసి తన ఉదారతను చాటుకున్నారు. ముంబై ధారావిలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు ఆక్సిజెన్ సిలెండర్లు అలాగే వెంటిలేటర్లను సప్లై చేసి తన ఉదారతను చాటుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు