చూస్తుండగానే గత ఏడాది 2025 పూర్తయిపోయింది. ఇక కొత్త ఏడాది 2026 వస్తుండడంతోనే తెలుగు సినిమా నుంచి కొత్త ఊపు కూడా మొదలైంది. పలు చిత్రాలకి సాలిడ్ బుకింగ్స్ అలాగే ఎన్నో సినిమాల తాలూకా అప్డేట్స్ నిన్న పలకరించాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం వచ్చినప్పటికీ కొందరు హీరోల ఫ్యాన్స్ కొంచెం నిరాశ గానే ఉన్నారు.
దాదాపు మన స్టార్స్ సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చాయి. అలాగే ఇంకొందరు అప్డేట్స్ రాకపోయినా వారి ఆఫ్ లైన్ పిక్స్ అయినా బయటకి వచ్చాయి. కానీ RRR హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల అభిమానులు డిజప్పాయింట్ తోనే మొదలు పెట్టుకున్నారు. వీరి సినిమాల నుంచి కనీసం ఏ చిన్న అప్డేట్ కానీ పోస్టర్ కానీ రాకపోవడం వారికి నిరాశ కలిగించింది.
దీనితో కొత్త ఏడాది వారికి ఈ రకంగా స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. ఎన్టీఆర్, నీల్ సినిమా షూటింగ్ దశ లోనే ఉంది. చరణ్ పెద్ది సినిమా కూడా చివరికి వస్తుంది. సో చిన్న అప్డేట్ అయినా వారు ఆశించారు కానీ ఏది రాకపోవడంతో ఇక సంక్రాంతి కోసమే ఎదురు చూస్తున్నారు.
