ఓటీటీలో ‘అఖండ 2’ విలన్ సినిమా.. క్రైమ్ థ్రిల్లర్ ఎందులో అంటే!

Drive OTT

గత ఏడాదిలో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘అఖండ 2’ కూడా ఒకటి. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమాలో టాలెంటెడ్ నటుడు ఆది పినిశెట్టి నటించిన సంగతి తెలిసిందే. పవర్ఫుల్ విలన్ రోల్ లో తాను ఈ సినిమాలో నటించాడు. అయితే అదే సినిమాతోనే ఆది పినిశెట్టి నటించిన మరో సినిమా ఆ వారం విడుదలకి వచ్చింది.

మరి ఆ చిత్రమే ‘డ్రైవ్’ (Drive). ఓ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి వచ్చేసింది. ఈ సినిమా ఓటిటి హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో నేటి నుంచి ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. పైగా ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రావడం విశేషం. ఇక ఈ చిత్రానికి జెనుస్ మొహమ్మద్ దర్శకత్వం వహించగా వి ఆనంద ప్రసాద్ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version