కన్ఫర్మ్..అదిరే పోస్టర్ తో రామరాజు వస్తున్నాడు.!

Published on Mar 20, 2021 4:25 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఇంకొక్క వారంలో వస్తుండగా ఆల్రెడీ సోషల్ మీడియాలో అభిమానుల హంగామా మొదలయ్యింది. మరి ఓ స్టార్ హీరో సినిమా చేస్తున్నాడు అంటే ఆ స్పెషల్ డే రోజున ఆ సినిమా అప్డేట్స్ తప్పనిసరి. మరి అలా ఇప్పుడు చరణ్ చేస్తున్న భారీ చిత్రాల్లో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి ఓ బ్లాస్టింగ్ అప్డేట్ వస్తుంది అని విన్నాము.

అందులో భాగంగా ఆ అప్డేట్ ను మేకర్స్ ఈరోజే రివీల్ చేస్తారని కూడా విన్నాం. సో ఫైనల్ గా మేకర్స్ ఆ అప్డేట్ ను రివీల్ చేసేసారు. రాబోయే చరణ్ పుట్టినరోజున ఒక పవర్ ఫుల్ ఫైర్ కాస్ట్ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అల్లూరిగా ఇప్పటికే రాజమౌళి చరణ్ నిప్పులలో చురకత్తిలా ఏ స్థాయిలో చూపించారో మనం చూసాం. మరి ఈ సరి ఎలాంటి పోస్టర్ ను విడుదల చేస్తారో చూడాలి. మొత్తానికి రామరాజు రావడం కన్ఫర్మ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :