అలియా వలన ఆర్ ఆర్ ఆర్ కి సమస్యలు?

aliabhatt

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ హీరో రామ్ చరణ్ సీతారామరాజు పాత్ర చేస్తుండగా…ఆయన ప్రేయసి సీత పాత్రలో అలియా నటిస్తుంది. అలియా పాత్రకు నిడివి తక్కువ అయినప్పటికీ కథలో చాలా కీలకం అని తెలుస్తుంది. అలియా వలన ఆర్ ఆర్ ఆర్ కి సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కారణం సుశాంత్ సింగ్ మరణమే.

సుశాంత్ సింగ్ మరణం తరువాత అతని చావుకు పరోక్షంగా కారణమైన అలియా భట్, కరణ్, సల్మాన్ ఖాన్ నటించిన చిత్రాలు బీహార్ లో బ్యాన్ చేస్తాం అని బీహారీలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అలియా ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా ఉండగా ఆర్ ఆర్ ఆర్ విడుదలను బిహారీలు అడ్డుకొనే ఆస్కారం కలదు. ఒకేవేళ ఇదే కనుక జరిగితే తెలుగు సినిమాకు మంచి మార్కెట్ ఉన్న బీహార్ ని కోల్పోవాల్సి వస్తుంది. అది ఆర్ ఆర్ ఆర్ వసూళ్లపై కొంత ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు. ఐతే ఇంకా ఈ మూవీ విడుదలకు ఏడాది సమయం ఉండగా…ఈ సమస్య తీరిపోయే అవకాశం కలదు.

Exit mobile version