“RRR” సెన్సేషన్..వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 ప్లేస్ లో..!

Published on May 27, 2022 2:00 pm IST

ఈ ఏడాదిలో వచ్చిన ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో మన టాలీవుడ్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చెయ్యగా ఇప్పుడు ఓటిటి లో కూడా వచ్చి భారీ స్థాయి రెస్పాన్స్ ని అందుకుంటుంది.

అయితే హిందీలో నెట్ ఫిక్స్ లో అందుబాటులోకి రాగా ఇతర సౌత్ భాషల్లో జీ 5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఈ సినిమా జీ 5 లో మాత్రం దుమ్ము లేపుతుందట. ఏకంగా ప్రస్తుతం వరల్డ్ వైడ్ లోనే నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుందట. అలాగే 1000 మిలియన్ మినిట్ వ్యూస్ కి పైగా భారీ రెస్పాన్స్ తో ఈ సినిమా జీ 5 లో అదరగొడుతుందని చిత్ర బృందం మరియు జీ 5 వారు అనౌన్స్ చేసి ఈ రెస్పాన్స్ ఇచ్చిన ఆడియెన్స్ ని మరోసారి ధన్యవాదాలు తెలియజేసారు.

సంబంధిత సమాచారం :