“RRR” నుంచి ఆలియా భట్ ‘సీత’ లుక్ వచ్చేసింది.!

“RRR” నుంచి ఆలియా భట్ ‘సీత’ లుక్ వచ్చేసింది.!

Published on Mar 15, 2021 12:03 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న మహా యాగం “రౌద్రం రణం రుధిరం”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ లో అల్లూరిగా చరణ్, కొమరం భీం గా తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఇదిలా ఉండగా ప్రతీ ఒక్కరి పుట్టినరోజుకు ఒక స్పెషల్ గిఫ్ట్ ను ఇస్తున్న చిత్ర యూనిట్ ఇప్పుడు చరణ్ సరసన నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె పోషిస్తున్న సీత లుక్ ను చిత్ర యూనిట్ రివీల్ చేశారు. చరణ్ లుక్ లో ఎలా అయితే అల్లూరి సీతారామరాజును మరపించారో రాజమౌళి ఆలియాను కూడా సీతలా మైమరపించారని చెప్పాలి.

ఆమెలోని అభినయంను మన నేటివిటీకి తగ్గట్టుగా అత్యద్భుతంగా రాబట్టారు. దీపాల కాంతులలో మరిన్ని వెలుగులను విరజిమ్ముతూ సీత మరింత అభినయంగా కనిపిస్తుంది. దీనితో సినిమాలో ఈమె రోల్ ఇంకెంత చక్కగా ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి అది తెలియాలి అంటే వచ్చే అక్టోబర్ 13వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు