‘ఆర్ఆర్ఆర్’ మొత్తంలోనే హైలెట్ ?

Published on Jun 5, 2019 3:25 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూట్ లో గత రెండు రోజులుగా ఎన్టీఆర్ పై కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. (ఎన్టీఆర్) కొమరం భీంకు బ్రిటిష్ సైనికులకు మధ్య వచ్చే ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమా మొత్తంలోనే హైలెట్ గా నిలుస్తాయట.

బ్రిటిష్ సైనికులు భారతీయుల పై చేసే దాడులకి ప్రతీకారంగా ఎన్టీఆర్ వారిని అంతం చేసే క్రమంలో ఈ సన్నివేశాలు వస్తాయని సమాచారం. అయితే రెండో షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఈ సారి అలా జరగకుండా రాజమౌళి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని మరి షూట్ చేస్తున్నాడట.

ఇక ఇప్పటికే ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More