“RRR”..లేటెస్ట్ అప్డేట్ తో పాటు అసలైన క్లారిటీ కూడా ఇచ్చేసారు.!

Published on Jun 29, 2021 11:36 am IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలతో వస్తున్న పలు చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సెన్సేషనల్ సినిమా ఇప్పుడు షూటింగ్ ఫైనల్ దశలోకి చేరుకుంది. మరి ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచి సరైన అప్డేట్ లేక ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు మేకర్స్ అదిరే అప్డేట్ ను చెప్పారు.

ఒక ప్లెజెంట్ పోస్టర్ లో కొమరం భీం తారక్ బుల్లెట్ నడుపుతుండగా సీతారామరాజు చరణ్ వెనుక కూర్చొని ఉన్నాడు. అలా ఇంకా రెండు పాటలు మినహా షూట్ మొత్తం కంప్లీట్ చేసేశామని అధికారికంగా తెలపడంతో పాటుగా తారక్ మరియు చరణ్ లు ఇప్పటికే రెండు భాషల్లో తమ డబ్బింగ్ ను కంప్లీట్ చేసేసుకున్నారని కూడా తెలిపారు.

మరి వీటితో పాటుగా అసలైన క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ పోస్టర్ లో కూడా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అక్టోబర్ 13 కే ఫిక్స్ చేసి ఉన్నట్టుగా పొందుపరిచారు. సో “RRR” రిలీజ్ డేట్ పై అందరికీ మరోమారు క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఇక వచ్చే జూలై మొదటి వారం నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ జాయిన్ కానుంది. మరి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :