భారీ గ్రాండ్ లుక్ తో ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్ !

Published on Mar 25, 2020 12:06 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అత్యంత భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఉగాది పర్వదినం సందర్భంగా మోషన్ పోస్టర్ తో కూడుకున్న టైటిల్ లోగో వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అని టైటిల్ ను పెట్టారు. ఇక అంచనాలకి తగ్గట్లుగానే ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్ గ్రాండ్ లుక్ తో భారీ విజువల్స్ తో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తన క్రియేటివిటీతో తన ఇమాజినేస్ పవర్ తో రాజమౌళి మోషన్ పోస్టర్ తోనే ఫ్యాన్స్ ఆసక్తిని ఇంకా డబుల్ రెట్టింపు చేస్తూ అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా పవర్ ఫుల్ గా మోషన్ పోస్టర్ ను వదిలాడు.

కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే లేడి విలన్ గా ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు.
ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్ అనంతరం రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

More